క‌ర్ణాట‌క సీఎంకు మోదీ 'ఫిట్‌నెస్' ఛాలెంజ్: వీడియో

Wed,June 13, 2018 10:34 AM

Modi reveals workout regime, nominates HD Kumaraswamy for fitness challenge

న్యూఢిల్లీ: ఆరోగ్యంగా ఉండాలంటే మీరు కూడా వ్యాయామం చేస్తూ ఫొటోలు, వీడియోలను #HumFitToIndiaFit అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌మీడియాలో మీ సన్నిహితులతో పంచుకోండి అంటూ కేంద్ర క్రీడలశాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాలని కోహ్లీ సవాల్ విసిరారు. దీనిలో భాగంగానే భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాలని కొద్దిరోజుల క్రితం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సవాల్ విసిరారు. అందుకు స్పందించిన ప్రధాని మోదీ.. "మీ సవాల్‌ను స్వీకరిస్తున్నాను.. విరాట్! త్వరలోనే నా వీడియోను షేర్ చేస్తాను" అని ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే.

తాజాగా మోదీ యోగాతో పాటు పలు శారీరక వ్యాయమాలు చేసిన 2 నిమిషాల నిడివిగల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొంతమంది ప్రముఖులను ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో పాల్గొనాలని కోరుతున్నందుకు సంతోషిస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జనతాదళ్(సెక్యులర్) నేత, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి సవాల్ విసిరిరారు. అంతేకాదు 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో వ్యక్తిగతంగా అత్యధిక మెడల్స్ సాధించిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బత్రాతో పాటు ప్రత్యేకించి 40ఏళ్లు పైబడిన ధైర్యవంతులైన ఐపీఎస్ అధికారులందరికీ మోదీ సవాల్ విసిరారు.

హమ్‌ఫిట్‌తో ఇండియాఫిట్ అనే నినాదానికి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. రాజకీయ, సినీ, క్రీడారంగాలకు చెందిన ప్రముఖులతో పాటు చాలామంది తమదైన శైలిలో కసరత్తులు, యోగా, వ్యాయమాలు చేస్తూ ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలుస్తున్నారు.


1326
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles