ల‌క్ష కోట్ల కోసం ఆర్బీఐని పీడిస్తున్నారు...

Thu,November 8, 2018 05:07 PM

Modi government trying to capture RBI, says P. Chidambaram

కోల్‌క‌తా: అత్య‌వ‌స‌ర నిధి నుంచి ల‌క్ష కోట్లు ఇవ్వాలంటూ మోదీ ప్ర‌భుత్వం ఆర్బీఐపై వ‌త్తిడి తెస్తోంద‌ని మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబ‌రం ఆరోపించారు. వ‌చ్చే ఏడాది జ‌రిగే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల కోసం ఆ డ‌బ్బును వాడుకోవాల‌ని కేంద్రం ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ద‌ని, అందుకే ఆర్బీఐపై వ‌త్తిడి తెస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ఇవాళ కోల్‌క‌తాలో ప్రెన్స్‌కాన్ఫ‌రెన్స్‌లో చిదంబ‌రం మాట్లాడారు. అన్ని దారులు మూసుకుపోయాయి. ఆ టెన్ష‌న్‌లో ఆర్బీఐని ప్ర‌భుత్వం ల‌క్ష కోట్లు డిమాండ్ చేసింది. అయితే ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ఆ డిమాండ్‌ను తిర‌స్క‌రించారు. ఆ కార‌ణంతోనే ప్ర‌భుత్వం ఆర్బీఐ చ‌ట్టంలోని 7వ సెక్ష‌న్‌ను వాడింద‌ని చిదంబ‌రం పేర్కొన్నారు. అధికారాల‌ను వాడుకుని ఆర్బీఐని త‌న క‌బంద‌హ‌స్తాల్లో ఉంచుకునేందుకు కేంద్రం భావిస్తున్న‌ద‌ని, అలాంటిదే జ‌రిగితే దేశం విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. న‌వంబ‌ర్ 19వ తేదీన జ‌రిగే ఆర్బీఐ మీటింగ్ అత్యంత కీల‌కంగా మార‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

1784
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS