ఆ కేంద్ర మంత్రి పదవి ఊడినట్లే!

Thu,October 11, 2018 03:15 PM

Modi Government may ask MJ Akbar to quit the Cabinet

న్యూఢిల్లీ: పలువురు జర్నలిస్టుల నుంచి లైంగిక వేధింపుల‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్‌ను కేబినెట్ నుంచి తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనపై త్వరలోనే పెద్ద నిర్ణయం వెలువడనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆయన పత్రిక ఎడిటర్‌గా ఉన్న సమయంలో తమకు లైంగికంగా వేధించారంటూ ఐదుగురు మహిళలు ఆరోపించారు. ప్రస్తుతం విదేశీ పర్యటనల్లో ఉన్న అక్బర్.. ఇప్పటివరకు ఈ ఆరోపణలపై స్పందించలేదు. మీటూ ఉద్యమం ఇండియాలో ఉధృతంగా సాగుతున్న సమయంలో జర్నలిస్టులు తమ మాజీ బాస్, ప్రస్తుతం కేంద్ర మంత్రిపై లైంగిక ఆరోపణలు చేయడం సంచలనం రేపింది.

దీంతో మంత్రివర్గం నుంచి తనకు తానుగా తప్పుకోవాలని అక్బర్‌కు సూచించే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2014 ఎన్నికలకు ముందు అక్బర్ బీజేపీలో చేరారు. ఏడాది తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. అంతర్జాతీయ వేదికలపై తమది మహిళల పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకుంటున్న సమయంలో ఇలాంటి వ్యక్తి కేబినెట్‌లో ఉండటం మంచి కాదని మోదీ సర్కార్ భావిస్తున్నది. ఎంజే అక్బర్‌పై తొలిసారి ప్రియా రమణి అనే జర్నలిస్ట్ ఈ లైంగిక దాడి ఆరోపణలు చేశారు.

2917
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS