పెరగనున్న టీవీ, మొబైల్ ఫోన్ల ధరలు

Thu,February 1, 2018 02:15 PM

Mobile phones and TV prices may go up now

న్యూఢిల్లీ : మొబైల్ ఫోన్లు తరుచూ మార్చేవారికి, టీవీలను కొనేవారికి తీవ్ర నిరాశే ఎదురైంది. సెల్‌ఫోన్లు, టీవీల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ 15 నుంచి 20 శాతానికి పెంచినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. మేకిన్ ఇండియాను ప్రమోట్ చేసేందుకు తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలపై భారం పడనుంది. విదేశాల్లో తయారు చేస్తున్న సెల్‌ఫోన్స్, టీవీలను ఇక్కడే తయారు చేయడం వల్ల.. ఇక్కడి యువతకు ఉపాధి కూడా దొరికే అవకాశం ఉందనే కోణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. టీవీల విడిభాగాలపై కూడా కస్టమ్స్ డ్యూటీ 15 శాతం పెరగనుంది. మొత్తానికి సెల్‌ఫోన్స్, టీవీల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో.. ధరలు అధికంగా పెరగనున్నాయి.

3237
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles