కొడుకులను అరెస్ట్ చేశారు..తండ్రి తప్పించాడు

Fri,December 28, 2018 08:07 PM

Mob frees cow slaughter accused in up

ఘజియాబాద్: గోవధ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ వెంటనే నిందితుల తండ్రి అక్కడికి వచ్చి తన కొడుకులను పోలీసుల నుంచి తప్పించాడు. ఈ ఘటన ఘజియాబాద్‌లోని నూర్‌జంగ్ ప్రాంతంలో వెలుగుచూసింది. పోలీసులు నూర్ జంగ్‌లోని మటన్ షాపు దగ్గరికి వెళ్లి గోవధ కేసులో నిందితులుగా ఉన్న అసిఫ్ ఖురేషి, అతని సోదరుడు సాజిద్‌ను అరెస్ట్ చేశారు.

విషయం తెలుసుకున్న నిందితుల తండ్రి, మాజీ కౌన్సిలర్ అస్లమ్ ఖురేషి వెంటనే మటన్ షాపు దగ్గరికి కొంతమందిని వెంటబెట్టుకుని వచ్చి పోలీసులను రౌండప్ చేశాడు. అదే సమయంలో పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు మటన్ షాపులోని కత్తిని లాక్కొని అస్లమ్ ఖురేషి పిస్తోల్‌తో కొట్టారని అస్లమ్ ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణల్లో వాస్తవం లేదని, తప్పించుకున్న ఇద్దరు నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఏఎస్పీ గౌతమ్ చెప్పారు.

4665
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles