కస్టడీలో ఎమ్మెల్సీ మనోరమా దేవి

Tue,May 17, 2016 08:36 AM

MLC Manorama devi sent for judicial custody

గయా : బీహార్‌లోని జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మనోరమా దేవి గయా కోర్టులో లోంగిపోయారు. మద్య నిషేధ చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో ఆమె పోలీసుల ముందు హాజరయ్యారు. ఆ తర్వాత పోలీసులు మనోరమాను కోర్టులో హాజరుపరిచారు. ఆమెను 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీకి పంపారు. తాను ఏ నేరం చేయలేదని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ఇంట్లో అక్రమంగా మద్యం నిలువ చేసిన కేసులో ఆమె తప్పించుకు తిరిగారు. రాజకీయంగా తనను టార్గెట్ చేశారని ఆమె అన్నారు. ఎమ్మెల్సీ మనోరమా కుమారుడు రాకీ యాదవ్ కూడా ఓ హత్య కేసులో పోలీసుల ఆధీనంలోనే ఉన్నాడు. గయాలో జరిగిన ఘటనలో ఎమ్మెల్సీ కుమారుడు ఆదిత్యా సచ్‌దేవ్ అనే యువకున్ని షూట్ చేసి చంపాడు. ఆ కేసులో భాగంగా ఎమ్మెల్సీ ఇంటి సోదాకు వెళ్లిన పోలీసులకు మద్యం బాటిళ్లు కనిపించాయి. ఇప్పుడా రాష్ట్రంలో మద్య నిషేధం అమలులో ఉంది. ఇంట్లో బాల కార్మికులను పెట్టకున్న కారణంగా కూడా ఆమెపై పోలీసులు మరో కేసును నమోదు చేశారు.

1604
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles