టోల్‌ప్లాజా సిబ్బందితో ఎమ్మెల్యే వాగ్వాదం.. వీడియో

Wed,July 18, 2018 12:11 PM

MLA PC George create ruckus at toll plaza in Thrissur

తిరువనంతపురం : కేరళ స్వతంత్ర ఎమ్మెల్యే పీసీ జార్జ్.. త్రిశూర్ టోల్‌ప్లాజా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే కారు రాగానే టోల్‌ప్లాజా సిబ్బంది.. ఆ కారును ఆపారు. దీంతో ఎమ్మెల్యే జార్జ్ కారులో నుంచి దిగి వచ్చిన తన కారునే ఆపుతావా అంటూ అక్కడున్న సిబ్బందిని బెదిరించారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు కలిసి బారికేడ్‌ను విరగొట్టారు. అనంతరం టోల్ రుసుం చెల్లించకుండానే ఎమ్మెల్యే కారు అటునుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది.


2080
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles