అరకు ఎమ్మెల్యేను కాల్చి చంపిన మావోయిస్టులు

Sun,September 23, 2018 01:46 PM

విశాఖ: విశాఖ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో కిడారి సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. కాల్పుల్లో అరకు మాజీ ఎమ్మెల్యే శివేరిసోము కూడా ప్రాణాలు కోల్పోయారు. గతంలో పలుమార్లు కిడారిని మావోయిస్టులు హెచ్చరించినట్లు సమాచారం.
డంబ్రిగూడ మండలం తుటంగి దగ్గర రాజకీయ నేతలపై మావోయిస్టులు దాడి చేశారు. దాడిలో సుమారు 50 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.


2014లో కిడారి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. కిడారిపై దాడి జరిగినట్లు మాకు సమాచారం అందిందని ఎస్పీ రాహుల్ దేవ్ తెలిపారు. దాడిని నిర్ధారించేందుకు సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లారని ఎస్పీ చెప్పారు.

4221
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles