అరుదైన ఘటన.. ప్రభుత్వాన్ని మెచ్చుకున్న ప్రతిపక్ష నేత!

Fri,November 16, 2018 05:44 PM

MK Stalin praised Tamilnadu Governments efforts in tackling Gaja cyclone

చెన్నై: సాధారణంగా ప్రతిపక్షమేదైనా అధికార పక్షాన్ని తప్పుబట్టడమే పనిగా పెట్టుకుంటుంది. కానీ తమిళనాడులో మాత్రం ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మాత్రం అక్కడి ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం విశేషం. గజ తుఫాన్‌ను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొన్న తీరును ఆయన మెచ్చుకున్నారు. తుఫాన్‌ను ఎదుర్కోవడానికి తమిళనాడు స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తీసుకున్న ముందస్తు చర్యలు అద్భుతంగా ఉన్నాయని స్టాలిన్ ట్వీట్ చేశారు. పాలకులు కూడా ఈ ఏజెన్సీకి సహకారం అందించాలని ఆయన కోరారు. తుఫాను తర్వాత సహాయక చర్యలను కూడా తుఫాను వేగంతో పూర్తి చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధం కావాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. సహాయక చర్యల్లో ప్రభుత్వానికి అవసరమైన సాయం చేయాలని తన పార్టీ కార్యకర్తలకు కూడా స్టాలిన్ పిలుపునిచ్చారు. గతంలో 2015లో చెన్నైలో వరదలు వచ్చినపుడు అన్నాడీఎంకే ప్రభుత్వం సరిగా స్పందించలేకపోయిందని అప్పట్లో స్టాలిన్ విమర్శలు గుప్పించారు.

5909
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles