ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లే అతని ప్రాణాలు తీశాయి !

Mon,September 10, 2018 03:05 PM

Missing HDFC Vice President found dead in Mumbais Kalyan  Highway

ముంబై: ముంబైలో సంచలనంగా మారిన సిద్ధార్ద్ సంఘ్వీ మిస్సింగ్ కేసు వీడింది. సిద్ధార్ధ్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అయిదు రోజులుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకర్ ఆచూకీ లేడన్న విషయం తెలిసిందే. బ్యాంక్ మేనేజర్ సిద్ధార్ద్ కారు రెండు రోజుల క్రితం దొరికింది. ఈ కేసులో సర్ఫరాజ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కారుపై రక్తపు మరకలు, కత్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసిన ముంబై పోలీసులు హంతకుడి నుంచి కొన్ని విషయాలను తెలుసుకున్నారు. కమలామిల్స్ కాంపౌండ్‌లోనే సిద్ధార్ధ్‌ను.. సర్ఫరాజ్ హత్య చేశాడు. అదే కారులో అతన్ని శవాన్ని తీసుకెళ్లాడు. క్యాబ్ డ్రైవర్‌గా చేస్తున్న సర్ఫరాజ్.. కిరాయి హంతకుడిగా మారాడు. ఎవరో చంపమన్నారని, అతను సిద్ధార్ధ్‌ను హత్య చేశాడు. సిద్ధార్థ్‌తో పనిచేసిన తోటి ఉద్యోగులే ఈ హత్యకు ప్లానేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 2007లో సీనియర్ మేనేజర్‌గా హెచ్‌డీఎఫ్‌సీలో సిద్ధార్ద్ చేశాడు. అయితే ఇటీవల అతనికి వరుసగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చాయి. ఇది సహించలేకపోయిన అతని సహ ఉద్యోగులే.. సిద్ధార్ధ్ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముంబైలోని క‌ల్యాణ్ హైవే ప్ర‌దేశంలో సిద్ధార్ద్‌ మృత‌దేహం ల‌భ్య‌మైంది.

3054
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles