మిరాజ్-2000 ప్రత్యేకతలు..

Tue,February 26, 2019 12:42 PM

Mirage 2000 Specifications

జైషే ఉగ్రవాద శిబిరాలపై మొత్తం 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలు మెరుపుదాడి చేసిన సంగతి తెలిసిందే. భారత వైమానిక దళం మెరుపుదాడులు చేసి సుమారు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. దీంతో మిరాజ్ -2000 యుద్ధ విమానాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ యుద్ధ విమానాల గురించి తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. 1999 కార్గిల్ యుద్ధంలోనూ మిరాజ్ యుద్ధ విమానం కీలకపాత్ర పోషించింది.

-ఈ యుద్ధ విమానాన్ని డసాల్ట్ ఏవియేషన్ లైసెన్స్‌తో హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది.
-దీనిలో డిజిటల్ వెపన్ డెలివరీ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది.
-ఇజ్రాయెల్ టెక్నాలజీ లైటింగ్‌తో.. శత్రువుల్ని ఆటోమేటిక్‌గా గుర్తించగలిగే సామర్థ్యం ఉంది.
-చిమ్మ చీకటిలో కూడా లక్ష్యాలను చేధించి ధ్వంసం చేస్తుంది.
-ఆకాశం నుంచి ఆకాశంలోకి బాంబుల్ని వేయగల సత్తా మిరాజ్ సొంతం.
-మైకా టార్గెట్ ఎయిర్ టు ఎయిర్ ఇంటర్‌సెప్ట్, యుద్ధ క్షిపణులు, మ్యాజిక్ 2 యుద్ధ క్షిపణులను మోసుకెళ్లగలదు.
-ఎంబీడీఏ బీజీఎల్ 1000 లేజర్ గైడెడ్ బాంబు, ఎంబీడీఏ ఏఎస్30ఎల్, ఎంబీడీఏ ఆర్మాట్ యాంటీ రాడార్ మిస్సైల్, ఎంబీడీఏ ఏఎం39 ఎక్సోసెట్ యాంటీ షిప్ మిస్సైల్, ఎంబీడీఏ రాకెట్ లాంఛర్లు, ఎంబీడీఏ ఆపాచీ స్టాండ్ ఆఫ్ వంటి ఆయుధాలని మోసుకెళ్తుంది.
-గంటకు 2,795 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.
-నిమిషాల వ్యవధిలోనే శత్రు స్థావరాలపై బాంబుల వర్షం కురిపించడంలో దిట్ట.
- ఒక్క నిమిషంలో 1200 నుంచి 1800 రౌండ్ల ఫిరంగుల్ని పేల్చగలదు.

8313
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles