మైనర్‌పై 51 రోజులు అత్యాచారం

Wed,May 8, 2019 12:08 PM

Minor girl confined raped by 3 men for 51 days in Noida

నోయిడా : సభ్యసమాజం తలదించుకునేలా కామాంధులు రెచ్చిపోయారు. వరుసగా 51 రోజులు ఓ మైనర్‌ పట్ల క్రూర మృగాల్లా ప్రవర్తించారు. 16 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం చేసి హింసించారు. ఈ దారుణ సంఘటన ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో చోటు చేసుకుంది.

మార్చి 2వ తేదీన ఇంట్లో ఉన్న బాలికను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. ఆ తర్వాత ఆమెను ఓ గదిలో నిర్బంధించారు. ఇక నాటి నుంచి ఏప్రిల్‌ 22 వరకు ఆమెపై ఆ ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. వేధింపులకు గురి చేస్తూ హింసించారు. ఇక్కడి నుంచి తప్పించుకుపోతే చంపేస్తామని బెదిరించారు. మొత్తానికి బాధిత బాలిక ఏప్రిల్‌ 22 నుంచి ఆ క్రూర మృగాల నుంచి తప్పించుకుని తన ఇంటికి వచ్చింది. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు బాలిక చెప్పింది.

దీంతో బాలిక తల్లిదండ్రులు ఫేజ్‌ 3 పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట పోలీసులు ఫిర్యాదును తిరస్కరించారు. ఎస్పీని కలిసి తమ గోడును వినిపించిన తర్వాత ఆయన ఆదేశాల మేరకు ఫేజ్‌ 3 పోలీసులు పోక్సో చట్టం కేసులు నమోదు చేశారు. నిందితులను చోటు(మధ్యప్రదేశ్‌), సూరజ్‌(ఉత్తరప్రదేశ్‌)గా గుర్తించారు. బాలిక ఇంటికి సమీపంలోని ఓ ఇంట్లో కొద్ది నెలల క్రితం అద్దెకు దిగారు. ఆ తర్వాత బాలికతో పరిచయం ఏర్పరుచుకుని.. అదును చూసి ఆమెను కిడ్నాప్‌ చేసి ఈ దారుణానికి పాల్పడ్డారు.

4759
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles