బ్యాంకుల్లో నగదు అందుబాటులో ఉంచండి..

Wed,January 17, 2018 04:04 PM

Ministers Etela rajender, pocharam meets ARun jaitely Today


న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో రాష్ట్ర మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈటెల రాజేందర్ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించనున్న 4 వేల రూపాయల పెట్టుబడిపై జైట్లీతో మంత్రులు ఈటల, పోచారం చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన నగదు కొరతను అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకెళ్లారు. 4 వేల రూపాయల చెక్ ను అందించే క్రమంలో రానున్న రోజుల్లో రైతులకు ఇబ్బంది కాకుండా చూడాలని జైట్లీని విజ్ఞప్తి చేశారు. మే నెలలో రైతులకు పెట్టుబడి కింద ఆరు వేల కోట్ల రూపాయల విలువైన చెక్కులు ఇవ్వనున్నామని, బ్యాంకుల్లో నగదు అందుబాటులో ఉంచాలని కోరారు. బిందు సేద్యానికి సంబంధించిన పరికరాలపై జీఎస్టీని తగ్గించాలని అరుణ్ జైట్లీకి విజ్ఞప్తి చేశారు.

సమావేశమనంతరం మంత్రి పోచారం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పంటకు రూ.6 వేల కోట్లు అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. రైతులకు చెక్కుల రూపంలో ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించగా..సరిపోయేవిధంగా నగదు నిల్వలు లేవని బ్యాంకర్లు తెలిపారు. బ్యాంకుల్లో తగిన నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని జైట్లీని కోరాం. సూక్ష్మ సేద్య వ్యవసాయానికి ప్రభుత్వ రాయితీ ఇస్తోంది. జీఎస్టీ అమలుతో రైతులపై భారం పడుతున్నది. సూక్ష్మ సేద్య వ్యవసాయంపై జీఎస్టీ భారం తగ్గించాలని కోరామని పోచారం అన్నారు. మంత్రుల వెంట ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ తదితరులు ఉన్నారు.

2902
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles