
గుహవాటి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంపై త్రిపుర అటవీశాఖ మంత్రి మేవార్ జమాతియా ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర మంత్రి జోగు రామన్న త్రిపురలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి జమాతియాతో మంత్రి జోగు రామన్న సమావేశమయ్యారు. త్రిపురలో అటవీశాఖ స్థితిగతులను మంత్రికి జమాతియా వివరించారు. హరితహారం కార్యక్రమం ద్వారా 230 కోట్ల మొక్కలు పెంచాలన్న సీఎం కేసీఆర్ ఆలోచన అద్భుతమని అన్నారు జమాతియా. మంత్రి జోగు రామన్న వెంట ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, సీఈవో అలోక్ కుమార్, పీసీసీఎఫ్ ప్రశాంత్ కుమార్ ఝా ఉన్నారు.