రైతు మరణిస్తే రూ.7లక్షల పరిహారం అందిస్తాం..!

Fri,July 12, 2019 03:10 PM

Minister Botsa Satyanarayana Speech  in AP Assembly Budget Sessions 2019

అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ స్ఫూర్తితో రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని, మాది రైతు సంక్షేమ ప్రభుత్వమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా వ్యవసాయ బడ్జెట్‌ను ఇవాళ మంత్రి బొత్స ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బొత్స రూ.28,866.28 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతూ.. ఈ అవకాశం కల్పించినందుకు సీఎం జగన్ మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయ పెట్టుబడి కోసం రైతులు అప్పుల పాలు కాకూడదని వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టాం. రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతుభరోసా అందిస్తాం. పంట బీమాను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది. సున్నా వడ్డీకే రైతుకు రుణం ఇవ్వడం రైతులకు పెద్ద ఊరట. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.7లక్షల పరిహారం అందిస్తాం. రైతులు, కౌలు రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా కలెక్టర్లు వెంటనే స్పందించాలి. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు వ్యవసాయ కమిషన్ ఏర్పాటు. ప్రకృతి విపత్తుల సహాయనిధిని ఇతర అవసరాలకు మళ్లించమని స్పష్టం చేశారు.

ప్రధానాంశాలు..

రూ.28,866.23కోట్లతో వ్యవసాయ బడ్జెట్
రెవన్యూ వ్యయం రూ.27,946.65కోట్లు
పెట్టుబడి వ్యయం రూ.919.58 కోట్లు
ఉద్యానశాఖకు రూ.1532కోట్లు
ప్రతి రైతు కుటుంబానికి వైఎస్‌ఆర్ రైతుభరోసా కింద రూ.12,500
వైఎస్‌ఆర్ రైతు భరోసాతో 62 లక్షల మంది రైతులకు మేలు.
పట్టుపరిశ్రమకు రూ.158కోట్లు.
వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమాకు రూ.1163కోట్లు.
ధరలస్థిరీకరణకు రూ.3వేల కోట్లు.
వ్యవసాయ ఆధునికీకరణకు రూ.460కోట్లు
పశుసంవర్ధకశాఖకు రూ.1240కోట్లు
వైఎస్‌ఆర్ రైతుబీమాకు రూ.100కోట్లు
ప్రకృతి వ్యవసాయానికి రూ.91కోట్లు
ఎన్జీరంగా వర్శిటీకి రూ.335కోట్లు
ఉద్యాన వర్శిటీకి రూ.63కోట్లు
ఆయిల్ పాం రైతులకు ధరల్లో వ్యత్యాసం తగ్గించేందుకు రూ.80కోట్లు

2147
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles