బాంబు పేల్చి కిడ్నాప్ చేద్దామనుకున్నారు..కానీ..

Sun,February 10, 2019 04:50 PM

Militants make failed bid to kidnap bizman in Assam

ఉదల్ గురి: కొంతమంది అనుమానిత తీవ్రవాదులు ఓ వ్యాపారవేత్తను కిడ్నాప్ చేద్దామని ప్లాన్ వేశారు. కానీ వారు వేసిన ప్లాన్ ఫెయిల్ అయింది. వివరాల్లోకి వెళితే..తీవ్రవాదులు అసోం ఉదల్ గిరి జిల్లాలోని పనేరిలో ఓ వ్యాపారవేత్తను కిడ్నాప్ చేద్దామనుకున్నారు. తీవ్రవాదులు మూడు బైకులపై ఆ వ్యాపారవేత్త ఇంటికి వచ్చారు. మొదట ఆ వ్యాపారవేత్త ఇంటివైపు కాల్పులు జరిపి..ఆ తర్వాత ఇంటిపై గ్రైనేడ్ విసిరారు. అయితే గ్రైనేడ్ పేలకపోవడంతో వారు అనుకున్న పని చేయలేకపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు ఆ వ్యాపారవేత్తను దుండగుల చెర నుంచి కాపాడారు. గ్రైనేడ్ ను నిర్వీర్యం చేసిన పోలీసులు ఆదివాసీ తీవ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని సీఐ దుర్గా కింగ్ కార్ శర్మ తెలిపారు.

2522
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles