మోదీని క‌లిసిన అమెరికా విదేశాంగ మంత్రి

Wed,June 26, 2019 02:24 PM

Mike Pompeo meets Narendra Modi, discusses key strategic issues

హైద‌రాబాద్‌: అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో ఇవాళ ప్ర‌ధాని మోదీని క‌లిశారు. ద్వైపాక్షిక సంబంధాల‌పై ఇద్ద‌రూ చ‌ర్చించుకున్నారు. వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం గురించి మాట్లాడుకున్నారు. మంగ‌ళ‌వారం రాత్రి పొంపియో న్యూఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ మ‌ధ్యాహ్నాం ఆయ‌న విదేశాంగ మంత్రి జ‌య‌శంక‌ర్‌తో మాట్లాడ‌నున్నారు. ఒసాకాలో జ‌ర‌గ‌నున్న జీ20 స‌ద‌స్సులో అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో మోదీ భేటీ అవుతార‌ని విదేశాంగ శాఖ ప్ర‌తినిధి రావీశ్ కుమార్ ట్వీట్ చేశారు. మోదీ రెండ‌వ సారి ప్ర‌ధాని బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఓ అమెరికా మంత్రి ఇండియాకు రావ‌డం ఇదే మొదటిసారి.

822
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles