ప‌క్షిని ఢీకొని.. కూలిన మిగ్‌ !

Fri,March 8, 2019 04:00 PM

MiG 21 fighter jet crashes in Rajasthan after hitting a bird

హైద‌రాబాద్: రాజ‌స్థాన్‌లో ఇవాళ ఫైట‌ర్ జెట్ మిగ్ 21 బైస‌న్‌ కూలింది. ఈ యుద్ధ విమానం బిక‌నీర్ స‌మీపంలోని నాల్ వ‌ద్ద కూలిన‌ట్లు తెలుస్తోంది. మిగ్‌లో ఉన్న పైల‌ట్ సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించారు. ఓ మిష‌న్‌లో భాగంగా మిగ్‌21 గాల్లోకి ఎగిరింది. అయితే ఆ మిగ్‌ను ఎదో ఢీకొట్టిన‌ట్లు కొంద‌రు అనుమానిస్తున్నారు. కానీ ఇంకా ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు అందాల్సి ఉంది. ఓ ప‌క్షి మిగ్‌ను ఢీకొని ఉంటుంద‌ని ఎయిర్‌ఫోర్స్ అధికారులు భావిస్తున్నారు.

1907
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles