కేదార్‌నాథ్‌లో కూలిన వాయుసేన హెలికాప్టర్.. వీడియో

Tue,April 3, 2018 09:32 PM

MI 17 helicopter of IAF crashed in Kedarnath

డెహ్రాడూన్: పైలట్, సహ పైలట్‌తోపాటు మరో నలుగురు వ్యక్తులతో వెళ్తున్న భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన హెలికాప్టర్ మంగళవారం ఉదయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్‌నాథ్ సమీపంలో కూలిపోయింది. ఎంఐ17 హెలికాప్టర్ కేదార్‌నాథ్‌లోని హెలిప్యాడ్‌పై దిగుతుండగా తక్కువ ఎత్తునుంచి కూలిందని, దీంతో అందులో ఉన్న ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారని రుద్రప్రయాగ్ జిల్లా కలెక్టర్ మంగేశ్ ఘిల్దియాల్ తెలిపారు. కేదార్‌నాథ్‌లో నిర్మాణ పనులు చేపట్టేందుకు గుప్త్‌కాశి నుంచి పెద్దఎత్తున యంత్ర పరికరాలను తీసుకొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.2652
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles