చంద్ర‌యాన్‌2.. బెంజ్ ట్వీట్‌ అదిరింది

Fri,September 6, 2019 03:42 PM

హైద‌రాబాద్‌: చంద్రయాన్‌2లోని విక్ర‌మ్ ల్యాండ‌ర్‌ ఇవాళ రాత్రి చంద్రుడి ఉప‌రిత‌లంపై దిగ‌నున్న విష‌యం తెలిసిందే. దీనిపై ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వార్త‌లు హోరెత్తుతున్నాయి. ప్ర‌ధానితో స‌హా అనేక మంది ప్ర‌ముఖులు త‌మ ట్వీట్ల‌తో విక్ర‌మ్‌కు గుడ్‌ల‌క్ కూడా చెప్పారు. అయితే మెర్సిడీజ్ బెంజ్ ఇండియా సంస్థ కూడా త‌న ట్విట్ట‌ర్‌లో చంద్ర‌యాన్‌2 ప్రాజెక్టును కీర్తించింది. చ‌రిత్ర‌లో ఓ కొత్త అధ్యాయం చోటుచేసుకోబోతున్న‌ట్లు బెంజ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్న‌ది. అయితే ఆ ట్వీట్‌కు పెట్టిన ఫోటో అద్భుతంగా ఉంది. కారు అద్దంలో చందమామ క‌నిపిస్తున్న ఫోటోను బెంజ్ సంస్థ త‌న ట్వీట్‌లో పోస్టు చేసింది. సాధార‌ణంగా సైడ్ మిర్ర‌ర్‌ల‌లో ఆబ్జెక్ట్స్ ఇన్‌ద మిర్ర‌ర్ ఆర్ క్లోజ‌ర్ దాన్ దే అపియ‌ర్ అని రాసి ఉంటుంది. అంటే అద్దంలో దూరంగా ఉన్న‌ట్లు క‌నిపిస్తున్నా.. అందులో కనిపించేవి చాలా ద‌గ్గ‌ర‌గానే ఉంటాయ‌ని అన్న అర్థం వ‌స్తుంది. నిజానికి ఇదో హెచ్చ‌రిక‌. కానీ ఇప్పుడు మ‌న‌కు చంద‌మామ అందింది. ఆ విష‌యాన్ని అద్భుత‌మైన రీతిలో బెంజ్ త‌న ట్వీట్‌లో చెప్పిన తీరు ఆక‌ట్టుకుంటున్న‌ది. భార‌త ఖ్యాతిని ఖండాంత‌రాల‌కు తీసుకువెళ్లిన ఇస్రోకు కంగ్రాట్స్ కూడా చెప్పింది బెంజ్ సంస్థ‌.

3624
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles