మెంటల్ హాస్పిటల్‌కు తీసుకొస్తే..బాలుడిని చంపాడు

Fri,October 12, 2018 04:30 PM

Mentally disturbed man killed a boy near hospital

జైపూర్‌: మానసిక వికలాంగుడు ఎనిమిదేళ్ల బాలుడి ప్రాణాలు తీశాడు. ఈ ఘటన జైపూర్‌లో వెలుగుచూసింది. హర్యానాకు చెందిన 28 ఏండ్ల వ్యక్తి మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. కుటుంబసభ్యులు చికిత్స కోసం అతన్ని హర్యానా నుంచి రాజస్థాన్‌లోని జైపూర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వారు వచ్చిన వాహనాన్ని ఆస్పత్రి ఎదుట ఆపారు. అదే సమయంలో వాహనంలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి (మానసిక వికలాంగుడు)దగ్గర్లోని ఇంట్లోకి చొరబడ్డాడు. ఎనిమిదేళ్ల బాలుడిపై కత్తితో దాడి చేసి చంపేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

2653
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles