బైక్‌ల మీద సింహాలను తరిమారు.. వీడియో

Thu,November 9, 2017 11:17 AM

Men on bikes chase lions in Gir forest

అహ్మాదాబాద్: గుజరాత్‌లోని గిర్ ఫారెస్ట్‌లో బైకర్లు రెండు సింహాలను తరిమిన ఘటన చోటుచేసుకున్నది. బైక్‌ల మీదు వెళ్తున్న నలుగురు వ్యక్తులు వెంటపడుతుంటే.. ఆ సింహాలు అడవిలోకి పరుగెత్తాయి. దానికి సంబంధించిన 34 సెకన్లు ఉన్న ఓ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. సౌరాష్ట్ర ప్రాంతంలో ఉన్న అమ్రేలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో గుజరాత్ అటవీశాఖ దానిపై విచారణ చేపట్టింది. బైక్ నెంబర్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. రాజ్‌కోట రిజిస్ట్రేషన్‌తో బైక్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల కొందరు వ్యక్తులు కారులో ఓ బుల్లి సింహాన్ని వెంటాడిన ఘటన కూడా జరిగింది. గిర్ ఫారెస్ట్‌లో సుమారు 400 సింహాలు ఉన్నాయి.

7487
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS