99 ఏండ్ల ఈ యోగా టీచర్ గురించి తెలుసుకోవాల్సిందే

Thu,June 21, 2018 06:01 PM

Meet India oldest inspiring yoga teacher amma nanamaal

కోయంబత్తూర్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సెలబ్రిటీలు, ప్రజలు పెద్ద సంఖ్యలో యోగాసనాల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. యోగా డే సందర్భంగా దేశప్రజలంతా ఖచ్చితంగా ఈ యోగా టీచర్ గురించి తెలుసుకోవాల్సిందే. కోయంబత్తూర్‌కు చెందిన 99 ఏండ్ల అమ్మనానమ్మాళ్ యోగాసనాలు వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అమ్మనానమ్మాళ్‌ను ‘యోగా పాటి’గా పిలుస్తుంటారు.

శతాధిక వయస్సులోనూ ఎంతోమందికి యోగాపాఠాలు చెప్తున్నారు. ఈ వయస్సులో కూడా అమ్మనానమ్మాళ్ ఎవరి సాయం నిలబడటం, నడవడం, కూర్చోవడమే కాకుండా కష్టతరమైన యోగాసనాలు వేస్తూ..అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. పశ్చిమోత్తనాసన, కంధరాసన, శీర్షాసనంతోపాటు ఇతర యోగాసనాలు చాలా సులభంగా వేస్తారు. అమ్మనానమ్మాల్ సుమారు 50కి పైగా యోగాసనాలలో నిష్ణాతులని ఆమె దగ్గర శిక్షణ తీసుకున్నవారు చెప్పారు. అమ్మనానమ్మాళ్ 2017లో రాష్ట్రపతి చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారాన్ని అందుకున్నారు.
ప్రధాని నరేంద్రమోదీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు కార్యక్రమంలో అమ్మనానమ్మాళ్ పాల్గొన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీకి యోగాసనాలకు సంబంధించిన డెమో వీడియోను అందజేశారు. అమ్మనానమ్మాళ్ కర్నాటక ప్రభుత్వం నుంచి యోగా రత్న అవార్డులను అందుకున్నారు.

అమ్మనానమ్మాళ్ కుమారుడు బాలకృష్ణన్ ‘ఓజోన్ యోగా’ పేరుతో యోగా శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. యోగా కేంద్రంలో ఆమె ఇప్పటివరకు 10 లక్షల మంది విద్యార్థులకు యోగాసనాల్లో శిక్షణ ఇచ్చారు. వీరిలో 10వేల మంది యోగా శిక్షకులుగా పనిచేస్తున్నారు. అమ్మనానమ్మాళ్ దగ్గర శిక్షణ తీసుకున్న విద్యార్థులు చైనా, థాయ్‌లాండ్, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా,యూకే వంటి దేశాల్లో అంతర్జాతీయ యోగా పోటీల్లో పాల్గొని ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.

2117
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles