టైపిస్టులకే 'బామ్మ'.. టైపింగ్ స్పీడ్ చూస్తే మతిపోవాల్సిందే.. వీడియో

Fri,June 15, 2018 04:20 PM

Meet 72 year old superwoman typist from Madhya Pradesh who went viral

వయసు 72 ఏండ్లు. కాని.. కృష్ణారామా అంటూ ఇంట్లో కూర్చోలేదు. ఈ వయసులోనూ కష్టపడుతూ అందరికీ అదర్శంగా నిలుస్తున్నది ఈ బామ్మ. పేరు లక్ష్మీ బాయ్. ఊరు మధ్య ప్రదేశ్‌లోని సెహోర్. 72 ఏండ్ల వయసులోనూ సెహర్‌లోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు టైప్ రైటర్‌గా పని చేస్తున్నది. అంతే కాదు.. ఈ వయసులోనూ బామ్మ టైపింగ్ స్పీడ్ చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. తన కష్టపడేతత్వం, అంకిత భావం చూస్తే మీకు ముచ్చటేస్తుంది.గత కొన్ని రోజులుగా ఈ బామ్మ టైప్ చేసే వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా బామ్మ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. బామ్మను సూపర్ ఉమెన్ అంటూ పొగిడాడు. "నాకైతే తను సూపర్ ఉమెన్. యువకులంతా తనను ఆదర్శంగా తీసుకోవాలి. తన నుంచి చాలా నేర్చుకోవాలి. ఏ పని చిన్నది కాదు.. నామోషి కాదు.. వయసు అసలు దేనికీ అటంకం కాదు అని ఈ బామ్మ నిరూపించింది. మీకు ప్రణామాలు.." అంటూ ట్వీట్ చేశాడు సెహ్వాగ్. దీంతో వీరేంద్ర చేసిన ట్వీట్ వైరల్ అవుతున్న వీడియోకు ఆధ్యం పోసినట్లయింది. ఇక.. నెటిజన్లు ఆ బామ్మ మీదే చర్చించుకుంటున్నారు.


"నా కూతురుకు ప్రమాదం జరగడంతో తను పని చేసే పరిస్థితి లేదు. తన హాస్పిటల్ ఖర్చులకు తీసుకున్న అప్పు తీర్చడానికి నేను ఈ పని చేస్తున్నాను. నేను బిక్షమెత్తుకోలేను. తెలిసిన వాళ్ల ద్వారా ఈ జాబ్ దొరికింది. వీరేంద్ర సెహ్వాగ్ నా వీడియో షేర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నా అప్పులు తీర్చడానికి, సొంత ఇల్లు కట్టుకోవడానికి నాకు సహాయం కావాలి.." అంటూ తెలిపింది బామ్మ.

2618
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles