సిద్దిపేట మెడికల్ కాలేజీకి ఎంసీఐ అనుమతి

Wed,May 16, 2018 05:23 PM

Medical Council Of India give permission for Siddipeta Medical College

న్యూఢిల్లీ : సిద్దిపేట మెడికల్ కళాశాలకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 150 సీట్లతో 2018-19 ఏడాదికి సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభం కానుంది. మెడికల్ కాలేజీకి అనుమతి రావడంపై మంత్రి హరీష్‌రావు స్పందించారు. సిద్దిపేట మెడికల్ కాలేజీకి ఎంసీఐ అనుమతిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో 13 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సిద్దిపేట మెడికల్ కాలేజీ ఒకటి అని మంత్రి తెలిపారు.

1404
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS