జాబ్ ఇవ్వలేదని ఎయిర్‌పోర్టుకు బెదిరింపు కాల్

Thu,August 30, 2018 02:51 PM

MBA graduate held for making hoax bomb calls to Kempegowda Inernational airport

బెంగళూరు : తనకు ఉద్యోగం ఇవ్వలేదని ఓ ఎంబీఏ గ్రాడ్యుయేట్.. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు కేఎస్‌ఆర్ సిటీ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు ఫోన్‌కాల్స్ చేశాడు. వరుసగా ఫోన్ కాల్స్ చేసి భద్రతా సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేసిన ఆ నిరుద్యోగిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.

ఉడుపి జిల్లాలోని మణిపాల్ గ్రామానికి చెందిన కే ఆదిత్య రావు మెకానిక్ ఇంజినీరింగ్ చేసి ఎంబీఏ చదివాడు. 2008లో ఎంజీ రోడ్డులోని మల్టీ నేషనల్ బ్యాంకులో జూనియర్ మేనేజర్(సేల్స్)గా పని చేశాడు. ఆ తర్వాత మరో బ్యాంకులో సేల్స్ మేనేజర్‌గా విధులు నిర్వహించాడు. ఈ జాబ్ కూడా పోయాక.. ఉడుపిలోని ఓ విద్యా సంస్థలో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. సెక్యూరిటీ గార్డు జాబ్‌ను వదిలేసి.. ఉడుపిలోని ఓ మఠంలో వంట మాస్టారుగా పని చేశాడు. అది కూడా నచ్చకపోవడంతో తిరిగికి ఇంటికి చేరుకున్నాడు ఆదిత్య రావు.

ఉద్యోగాలు వదిలేసి తిరుగుతున్న ఆదిత్యరావును తల్లిదండ్రులు మందలించి.. ఈ ఏడాది మే నెలలో బెంగళూరుకు పంపారు. ఈ క్రమంలో కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ గార్డ్ జాబ్ కోసం ఆదిత్య రావు దరఖాస్తు చేసుకున్నాడు. ఎయిర్‌పోర్టు సిబ్బంది.. రెండు సార్లు ఆదిత్య రావు దరఖాస్తును తిరస్కరించింది. దీంతో కెంపేగౌడ ఎయిర్‌పోర్టుకు ఆగస్టు 21, 27 తేదీల్లో, కేఎస్‌ఆర్ సిటీ రైల్వే స్టేషన్‌కు 27న బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ చేశాడు. బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు. మొత్తానికి ఆదిత్య రావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఉన్నత చదువులు చదివిన ఆదిత్య రావు సెక్యూరిటీ గార్డు జాబ్ కోసం ఎందుకు దరఖాస్తు చేసి ఉంటాడు? లేక ఇతర కారాణాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

907
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles