కాంగ్రెస్‌, బీజేపీ.. రెండింటికీ తేడా లేదు..

Thu,February 14, 2019 03:00 PM

Mayawati equates Congress with BJP in her sharp attack

ల‌క్నో: బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌పై బీఎస్పీ నేత మాయావ‌తి ఫైర్ అయ్యారు. రెండు పార్టీలూ ఒక్క‌టే అన్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం, యూపీలోని బీజేపీ ప్ర‌భుత్వం ఒకే తీరుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని ఆమె విమ‌ర్శించారు. రెండు రాష్ట్రాల్లో హింస రాజ్య‌మేలుతోంద‌న్నారు. ఇటీవ‌ల అలీఘ‌డ్ వ‌ర్సిటీకి చెందిన 14 మంది విద్యార్థుల‌పై దేశ‌ద్రోహం కేసు న‌మోదు చేశారు. అలాగే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కొంద‌రు ముస్లింల‌పై గోహ‌త్య కేసును న‌మోదు చేశారు. దీంతో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ముస్లింల‌పై ఉక్కుపాదం మోపుతున్నాయ‌న్నారు. దీన్ని ఖండిస్తున్నాన‌ని ఆమె తెలిపారు. రెండు ప్ర‌భుత్వాల మ‌ధ్య తేడా లేద‌న్నారు.

871
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles