మాయావతి, అఖిలేష్ ఔట్.. కేజ్రీవాల్, ఉపేంద్ర ఇన్!

Mon,December 10, 2018 06:46 PM

Mayawati and Akhilesh give it a miss to Opposition Parties Meet

న్యూఢిల్లీ: బీజేపీయేతర పక్షాలు సోమవారం ఢిల్లీలో సమావేశం నిర్వహించాయి. 2019 ఎన్నికల్లో బీజేపీని అధికారంలో నుంచి దించడమే లక్ష్యంగా మహా కూటమి ఏర్పాటులో భాగంగా ఈ పక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సహా పలు ప్రాంతీయ పార్టీల అధినేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. మొత్తం 21 పార్టీల నేతలు సమావేశానికి హాజరవగా.. యూపీకి చెందిన మాయావతి, అఖిలేష్ యాదవ్ హాజరు కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. అయితే ఈ ఇద్దరి స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సోమవారమే ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ చీఫ్ ఉపేంద్ర కుష్‌వాహా సమావేశానికి హాజరవడం గమనార్హం.

చాన్నాళ్లుగా కాంగ్రెస్‌తో కేజ్రీవాల్ అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల సమావేశానికి ఆయన కూడా హాజరు కావడం చర్చనీయాంశమైంది. ఈ సమావేశానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆఎల్డీ చీఫ్ అజిత్ సింగ్, డీఎంకే చీఫ్ స్టాలిన్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జేడీఎస్‌కు చెందిన దేవెగౌడ హాజరయ్యారు. సమావేశం తర్వాత మీడియాతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాట్లాడారు. ఆర్బీఐ, సీబీఐ, ఈడీ, ఐటీ, ఎలక్షన్ కమిషన్‌లాంటి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

7031
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles