వుమెన్స్ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్ ప్రేమ పాఠాలు చూస్తారా.. వీడియో

Wed,March 20, 2019 01:42 PM

Mathematics Lecturer in a Womens College teaching Love Formulae to students

కర్నాల్: ఆయన కూడికలు, తీసివేతలు చెప్పే మ్యాథ్స్ లెక్చరర్. సబ్జెక్ట్‌లో భాగంగా ఫార్ములాలు కూడా ఉంటాయి కదా. దీంతో సదరు లెక్చరర్.. ఈ కూడికలు, తీసివేతలు, ఫార్ములాలు అన్నింటినీ కలిపి.. దానికి తన క్రియేటివిటీని కాస్త జోడించి ప్రేమ పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. హర్యానాలోని కర్నాల్‌లో ఉన్న వుమెన్స్ కాలేజ్‌లో చరణ్ సింగ్ అనే మ్యాథ్స్ లెక్చరర్ ప్రేమ ఫార్ములాలు బ్లాక్‌బోర్డుపై చెబుతూ అడ్డంగా బుక్కయ్యాడు. అతని ప్రేమ పాఠాలను ఓ విద్యార్థిని సెల్‌ఫోన్ కెమెరాలో చిత్రీకరించి ప్రిన్సిపల్‌కు చూపించింది. ఇంకేం.. వెంటనే సదరు లవ్ గురును సస్పెండ్ చేసి పారేశారు. నిజంగానే ఏదో మ్యాథ్స్ ఫార్ములా చెబుతున్నట్లుగా అతడు ఎంతో సీరియస్‌గా ఈ ప్రేమ ఫార్ములాలు చెబుతుంటే.. స్టూడెంట్స్ అందరూ నవ్వడం ఈ వీడియోలో చూడొచ్చు.

3830
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles