కొత్త ఎర్టిగా మోడల్ బుకింగ్స్ మొదలయ్యాయ్.. ధర ఎంతంటే?

Wed,November 14, 2018 02:46 PM

న్యూఢిల్లీ: మారుతి సుజుకి తమ కొత్త జనరేషన్ ఎర్టిగా మోడల్ బుకింగ్స్‌ను ప్రారంభించింది. ఈ నెల 21న కారును లాంచ్ చేయనున్నారు. అదే రోజు కొత్త మోడల్ ధరలను కూడా కంపెనీ ప్రకటించనుంది. మారుతి సుజుకీ షోరూమ్స్‌లో ఎర్టిగా బుకింగ్స్ చేసుకోవచ్చు. రూ.11 వేలు కట్టి కారును బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ కారుకు సంబంధించిన వివరాలు, మీ కాంటాక్ట్ వివరాలను ఇవ్వడానికి 1800 102 1800 నంబర్‌కు కాల్ చేయొచ్చు. ఈ 7 సీటర్ కొత్త మోడల్ పాత ఎర్టిగా కంటే కాస్త పొడవుగా, విశాలంగా ఉంది. లీటర్‌కు 25 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ కొత్త ఎర్టిగా మొత్తం ఐదు రంగుల్లో కస్టమర్ల ముందుకు రానుంది. ఆబర్న్ రెడ్, మాగ్మా గ్రే, ఆక్స్‌ఫర్డ్ బ్లూ, ఆర్కిటిక్ వైట్, సిల్కీ సిల్వర్ రంగుల్లో కొత్త ఎర్టిగాను మారుతి రిలీజ్ చేస్తున్నది. 2012లో తొలిసారి ఎర్టిగాను లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 4.18 లక్షల కార్లను మారుతి విక్రయించడం విశేషం. కొత్త ఎర్టిగా ధ‌ర రూ.7.5 ల‌క్ష‌ల నుంచి రూ.11 ల‌క్ష‌ల మ‌ధ్య ఉండే అవ‌కాశం ఉంది.

3106
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles