గ్రేనేడ్లు కావాలి.. మోదీని తొలిగిద్దాం..

Fri,August 31, 2018 05:24 PM

Maoists proposed steps to end Modi raj, like Rajiv Gandhi incident

ముంబై: ప్రధాని మోదీని హతమార్చేందుకు జరిగిన కుట్ర గురించి మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆ రాష్ట్ర ఏడీజీ పరమ్‌బీర్ సింగ్.. కామ్రేడ్లు రాసుకున్న లేఖలను బయటపెట్టారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఎలాగైతే రూపుమాపామో, అదే తరహాలో మోదీ ప్రభుత్వాన్ని కూల్చేద్దామని మావోలు లేఖలు రాసుకున్నారు. అయితే పౌర హక్కుల నేత రోనా విల్సన్ కామ్రాడ్ ప్రకాశ్‌కు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ఈ అంశాలు ఉన్నట్లు తేలింది. కిషన్‌తో పాటు ఇతర కామ్రేడ్లు మోదీ ప్రభుత్వ అంతం కోసం చర్యలు చేపట్టారని, అయితే గ్రేనేడు లాంచర్ల కోసం 8 కోట్లు అవసరం వస్తుందని కామ్రేడ్ ప్రకాశ్‌కు రాసిన లేఖలో ఉన్నది. ఈ లేఖల ఆధారంగానే మహారాష్ట్ర పోలీసులు.. దేశవ్యాప్తంగా అయిదుగురు పౌర హక్కుల నేతలను అరెస్టు చేశారు. ఈ నేతల్లో విరసం రచయిత వరవరరావు కూడా ఉన్న విషయం తెలిసిందే.7001
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles