అందుకే వారిని హతమార్చాం: గణేష్

Tue,March 5, 2019 11:16 AM

maoist leader ganesh declared in andhra pradesh MLA murder

విశాఖపట్టణం: సామ్రాజ్యవాదుల ఏజెంట్లుగా, ఆదివాసీలకు ద్రోహులుగా మారినందుకే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను హతమార్చామని ఏవోబీ స్పెషల్‌ జోన్‌ కమిటీ కార్యదర్శి గణేష్‌ ప్రకటించారు. ఆయన పేరిట ఈ రోజు విశాఖ విలేకరులకు ఓ లేఖ అందింది. టీడీపీలో చేరి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించారని, అంతేగాక ఆదివాసీలపై కక్షగట్టి 5 నెలలుగా వారిని జైలులో ఉంచి వేధించారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా అక్రమ అరెస్టులను వెంటనే నిలిపివేయకపోతే స్థానిక నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆ లేఖలో హెచ్చరించారు.

2678
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles