మీ ఫోన్ చెక్ చేసుకున్నారా.. కొత్త నంబర్ వచ్చి చేరింది!

Fri,August 3, 2018 02:36 PM

Many mobile users in India surprised to see UIDAI help line number in their contact list

న్యూఢిల్లీ: శుక్రవారం ఉదయం ఇండియాలోని కొన్ని వేల మంది మొబైల్ యూజర్లు తమ ఫోన్లు చూసుకొని ఆశ్చర్యపోయారు. తమ ప్రమేయం లేకుండానే కాంటాక్ట్ లిస్ట్‌లో ఓ కొత్త నంబర్ వచ్చి చేరింది. అది ఆధార్‌కార్డును జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) హెల్ప్‌లైన్ నంబర్. గ‌తంలో ఉన్న 1947 నంబ‌ర్‌ను కొత్త‌గా 1800-300-1947 నంబ‌ర్‌గా మార్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఈ కొత్త నంబర్ ఆటోమెటిగ్గా యూజర్ల కాంటాక్ట్ లిస్ట్‌లోకి రావడం ఆశ్చర్యపరిచింది. దీనిపై ఆందోళన చెందుతూ ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. నా ఫోన్‌లో ఈ నంబర్ ఉంది. దీనిని నేను సేవ్ చేయలేదు. మీ ఫోన్లు కూడా ఓసారి చెక్ చేసుకోండి అని ఆ వ్యక్తి ట్విటర్‌లో మొబైల్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశాడు. అయితే తాము ఏ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ లేదా మొబైల్ తయారీ సంస్థ‌ల‌ను త‌మ నంబ‌ర్‌ను యాడ్ చేయాల‌ని కోర‌లేద‌ని యూఐడీఏఐ వివ‌ర‌ణ ఇచ్చింది.

ఇదేంటని ఫ్రెంచ్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ ఇలియాట్ ఆల్డర్సన్ ప్రశ్నించారు. చాలా మంది వివిధ సర్వీస్ ప్రొవైడర్లు ఉన్న వాళ్లు, ఆధార్ ఉన్నవాళ్లు, లేనివాళ్లు.. ఎంఆధార్ యాప్ ఉన్నవాళ్లు, లేనివాళ్లు.. అందరికీ మీ ఫోన్ నంబర్ వాళ్ల మొబైల్స్‌లో వచ్చింది. అదీ వాళ్లకు తెలియకుండానే.. దీనిపై మీ వివరణ ఏంటి అని అడిగారు. ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ తన ఆధార్ నంబర్‌ను బయటపెట్టిన తర్వాత ఆయన వివరాలు పూర్తిగా బయటకు రావడంతో దీనిపై చాలా మంది ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పుడు ఓ కొత్త నంబర్ కాంటాక్ట్ లిస్ట్‌లో చొరబడటం మరింత ఆందోళన కలిగించే విషయం.

13462
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS