అయోధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును నిర్మించండి..

Mon,November 11, 2019 08:16 AM

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలని ఢిల్లీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మనోజ్ తివారీ డిమాండ్ చేశారు. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని తివారీ పేర్కొన్నారు. ఈ మేరకు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్‌పూరీకి మనోజ్ తివారీ లేఖ రాశారు. అయోధ్యను ప్రపంచంలోనే ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయొచ్చు. అక్కడ ఎయిర్‌పోర్టును నిర్మించడం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. త్వరలోనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిని మనోజ్ తివారీ కలుస్తారని బీజేపీ నాయకుడు నీల్‌కంఠ్ భక్తి తెలిపారు.

1463
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles