పారికర్‌ను చంపేస్తారేమో.. ఆయనకు రక్షణ కల్పించండి!

Sun,January 6, 2019 12:40 PM

Manohar Parrikar facing life threat provide him adequate security Goa Congress to President

పనజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌కు ప్రాణాపాయం ఉన్నదని, ఆయనకు రక్షణ కల్పించాలని గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు గిరీష్ చోడాంకర్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. రాఫెల్ డీల్‌కు సంబంధించి కీలక పత్రాలు ఆయన దగ్గర ఉన్నాయని, అందుకే ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆ లేఖలో గిరీష్ అన్నారు. ఇక ఈ పత్రాలకు సంబంధించి గోవా ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణెదని చెబుతున్న ఆడియో క్లిప్ అంశంపై ఎందుకు కేసు నమోదు చేయడం లేదని కూడా కాంగ్రెస్ ప్రశ్నించింది. రాఫెల్ డీల్‌కు సంబంధించి కీలకమైన పత్రాలు మనోహర్ పారికర్ బెడ్‌రూమ్‌లో ఉన్నాయని విశ్వజిత్ రాణె చెప్పారంటూ ఓ ఆడియో క్లిప్‌ను కాంగ్రెస్ బయటపెట్టింది. అయితే ఇది నకిలీ ఆడియో క్లిప్ అని, దీనిపై సీఎం మనోహర్ పారికర్ విచారణ జరిపించాలని రాణె డిమాండ్ చేశారు. పారికర్ ఆ కీలకమైన పత్రాలను దేశం ముందు నిర్భయంగా ఉంచి రాఫెల్ డీల్‌లోని అక్రమాలను బయటపెట్టాలని, దానికి కావాల్సిన రక్షణను ఆయనకు కల్పించాలని కాంగ్రెస్ కోరుతున్నది. ఆ కీలకమైన పత్రాలను లేకుండా చేసే ప్రమాదం కూడా ఉన్నదని ఆ పార్టీ ఆరోపించింది.

1859
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles