మ‌ణిపూర్ సీఎం కుమారుడికి అయిదేళ్ల జైలు శిక్ష‌

Mon,May 29, 2017 01:17 PM

Manipur CM Biren Singhs son Ajay Meetai awarded 5 years jail term in road rage case

ఇంఫాల్ : మ‌ణిపూర్ సీఎం ఎన్‌. బీర‌న్ సింగ్ కుమారుడికి ఆ రాష్ట్ర కోర్టు అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. సీఎం బీర‌న్ కుమారుడు అజ‌య్ మీతాయిపై 2011వ సంవ‌త్స‌రంలో రోడ్డు రేసు కేసు న‌మోదైంది. ఆ కేసులో ట్ర‌య‌ల్ కోర్టు ఇవాళ ఈ తీర్పును వెలువ‌రించింది. జ‌స్టిస్ ఎల్ నాగేశ్వ‌ర‌రావు, నావిన్ సిన్హాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ తీర్పును ఇచ్చింది. ఆరేళ్ల క్రితం ఎస్‌యూవీలో వెళ్తోన్న అజ‌య్‌ను ఇరోమ్ రోజ‌ర్ అనే వ్య‌క్తి త‌న సాధార‌ణ కారుతో దాటేశాడు. అది న‌చ్చ‌ని అజ‌య్ ఆ త‌ర్వాత త‌న ద‌గ్గ‌ర ఉన్న గ‌న్‌తో రోజ‌ర్‌ను కాల్చేశాడు. ఆ కేసులో ట్ర‌య‌ల్ కోర్టు సీఎం కుమారుడికి శిక్ష‌ను ఖ‌రారు చేసింది. ఫైరింగ్‌లో చ‌నిపోయిన రోజ‌ర్ పేరంట్స్ మాత్రం త‌మ‌ను బీజేపీ ప్ర‌భుత్వం ఏదైనా చేస్తుందేమో అని భ‌య‌ప‌డుతున్నారు.


1862
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles