మహిళ కడుపులో మంగళసూత్రం, ఇనుప ముక్కలు

Wed,November 14, 2018 12:15 PM

Mangalsutra bangles iron nails removed from woman stomach in Ahmedabad

అహ్మదాబాద్ : ఇనుప ముక్కలు, బోల్టులు, సేఫ్టి పిన్స్, పిన్నిసులు, హెయిర్ పిన్స్, బ్రాస్‌లెట్స్, చైన్లు, మంగళసూత్రం, కాపర్ రింగ్, గాజులు.. ఇవన్నీ ఏ హార్డ్‌వేర్, బంగారం షాపులో ఉన్నాయనుకుంటే పొరపాటే! ఈ వస్తువులన్నీ 40 ఏళ్ల వయసున్న మహిళ కడుపులో కనిపించాయి. మహారాష్ట్రలోని షిర్డీకి చెందిన సంగీత(40) మానసిక వికలాంగురాలు. ఆమె ఏం చేస్తుందో ఆమెకే తెలియని పరిస్థితి. కనిపించిన వస్తువులన్నింటినీ తినేస్తుంది.

అయితే ఆమెకు ఇటీవల కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చింది. దీంతో సంగీతను అక్టోబర్ 31న అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సంగీతకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆమె కడుపులో ఇనుప ముక్కలు, బోల్టులు, సేఫ్టి పిన్స్, పిన్నిసులు, హెయిర్ పిన్స్, బ్రాస్‌లెట్స్, చైన్లు, మంగళసూత్రం, కాపర్ రింగ్, గాజులు కనిపించాయి. సుమారు రెండున్నర గంటల పాటు సర్జరీ చేసి ఆమె కడుపులో ఉన్న వస్తువులన్నింటినీ బయటకు తీశారు. వీటి బరువు 1.5 కేజీలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

అక్యుఫేజియా అనే అరుదైన వ్యాధి వల్లే
అక్యుఫేజియా అనే అరుదైన వ్యాధి సంభవించిన మహిళలే ఈ విధంగా షార్ప్ ఐటెమ్స్, జీర్ణం కాని వస్తువులను తినేస్తుంటారు. మానసిక వికలాంగురాలైన సంగీతకు కూడా అక్యుఫేజియా అనే వ్యాధి ఉండడం వల్లే ఇనుప వస్తువులను మింగేసిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సంగీత ఆరోగ్యకరంగా ఉన్నారని వైద్యులు స్పష్టం చేశారు.

2896
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles