ఒబామాకు కేంద్రమంత్రి మేనకాగాంధీ లేఖ

Fri,July 1, 2016 06:22 PM

Maneka Gandhi asks Obama not to attend bull fighting fest


నాసిక్: స్పెయిన్‌లో జరుగనున్న బుల్ ఫైటింగ్ ఫెస్ట్ (ఎద్దుల పోటీల వేడుక) కు హాజరుకావొద్దని కేంద్రమంత్రి, జంతు హక్కుల కార్యకర్త మేనకాగాంధీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కోరారు. ఈ మేరకు ఒబామాకు మేనకాగాంధీ ఓ లేఖ రాశారు.

పర్యటనలో భాగంగా స్పెయిన్‌లోని పంప్‌లోనాకు వెళ్తున్న ఒబామాగారు జంతువులను హింసించేవిధంగా కొనసాగుతున్న ఎద్దుల పోటీలను వ్యతిరేకించాలి. బుల్ ఫైట్ ఫెస్ట్‌లో 48 ఎద్దులు పాల్గొంటున్నాయి. నిర్వాహకులు క్రూరంగా వ్యవహరించడం వల్ల పోటీల్లో పాల్గొనే ఎద్దులకు తీవ్ర గాయాలవడమే కాకుండా ఈ పోటీల్లో పాల్గొంటున్నవారు కూడా దెబ్బలు తగిలించుకుంటారని తెలిపారు. జంతువుల స్వేచ్ఛను హరించే ఇలాంటి క్రీడలను తీవ్రంగా పరిగణించి వ్యతిరేకించాల్సిన అవసరముందని ఆమె లేఖలో ఒబామాకు విజ్ఞప్తి చేశారు.

909
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles