బలవంతంగా ముద్దు పెట్టబోయాడు.. వీడియో

Fri,February 23, 2018 02:34 PM

Man tries to forcibly kiss girl at a Navi Mumbai railway station

ముంబై : పబ్లిక్‌లోనే ఓ వ్యక్తి బలవంతంగా ఓ యువతికి ముద్దు పెట్టబోయాడు. ఈ ఘటన నవీ ముంబైలోని టర్బే రైల్వేస్టేషన్‌లో గురువారం ఉదయం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగు చూసింది. టర్బే రైల్వేస్టేషన్ నుంచి ఘన్‌సోలికి వెళ్లేందుకు స్టేషన్‌కు వచ్చిన ఓ యువతిని 43 ఏళ్ల వ్యక్తి అనుసరించాడు. ఫ్లాట్‌ఫాం మీద నిల్చున్న ఆ యువతికి ఆయన బలవంతంగా ముద్దుపెట్టబోయాడు. ఆమె నెట్టడంతో అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఈ సమయంలో అక్కడున్న వారెవరూ అతడిని పట్టుకోలేదు. యువతికి కనీస సాయం చేయలేదు. మొత్తానికి బాధితురాలు.. ముద్దు పెట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.5363
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles