ఢిల్లీ సీఎంపై కారంపొడి చల్లిన వ్యక్తి అరెస్ట్

Tue,November 20, 2018 03:47 PM

Man throws chilli powder at Delhi CM Aravind Kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. సచివాలయంలోని తన చాంబర్ నుంచి బయటకు వస్తుండగా.. ఓ వ్యక్తి ఆయన మొహంపై కారంపొడి చల్లారు. దీంతో వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వ్యక్తి నరైనా ప్రాంతానికి చెందిన అనిల్ శర్మగా గుర్తించారు. ఈ దాడితో సచివాలయంలో కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో కేజ్రీవాల్ కళ్లద్దాలు కూడా విరిగిపోయాయి. అత్యంత భ‌ద్ర‌త ఉండాల్సిన సెక్ర‌టేరియట్‌లో ఈ దాడి జ‌ర‌గ‌డంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ పోలీసుల‌పై మండి ప‌డింది. కేజ్రీవాల్‌పై దాడి చేసిన త‌ర్వాత స‌ద‌రు అనిల్ శ‌ర్మ‌.. నిన్ను కాల్చి చంపుతాను అంటూ హెచ్చ‌రించిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు. గ‌తంలో త‌న ఫేస్‌బుక్ పోస్ట్‌లోనూ అత‌డు ఇవే హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. కేజ్రీవాల్‌పై ఇలాంటి దాడులు జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి కాదు. 2016లో ఓ మ‌హిళ ఆయ‌న‌పై ఇంకు చ‌ల్ల‌గా, త‌ర్వాత నాలుగు నెల‌ల‌కు మ‌రో వ్య‌క్తి షూ విసిరాడు.


1148
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles