సెల్ఫీ తీసుకుంటూ వాటర్‌పాల్స్‌లో పడిపోయాడు..

Wed,June 13, 2018 05:25 PM

Man taking selfie falls into waterfalls Velamalai area


కోయంబత్తూరు : ఓ యువకుడు సెల్ఫీ సరదా తీర్చుకోవాలనుకొని ప్రమాదవశాత్తు వాటర్‌పాల్స్‌లో పడిపోయాడు. ఈ ఘటన కోయంబత్తూరులోని వెలమాలై లోయ ప్రాంతంలో చోటుచేసుకుంది. జయప్రకాశ్ అనే వ్యక్తి వాటర్‌పాల్స్ దగ్గరకు వెళ్లి తన మొబైల్ ఫోన్‌తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో కాలు స్లిప్ అవడంతో జారి వాటర్‌పాల్స్‌లో పడిపోయాడు. అతని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు జయప్రకాశ్ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

1421
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles