నీళ్లు ఇవ్వమన్నాడని స్నేహితుడిని చంపేశాడు..

Thu,July 12, 2018 03:40 PM

Man Stabbed to Death Following Tiff Over Serving Cold Water in delhi

న్యూఢిల్లీ: చల్లనినీళ్లు ఇవ్వమన్న వ్యక్తిని అతని స్నేహితుడే చంపేసిన ఆశ్చర్యకర ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. జహంగీర్‌పురి చెందిన సాగర్ జులై 11న తన భార్యతో స్నేహితులను కలవడానికి జేజే కాలనీకి వెళ్లారు. వారు వెళ్లిన సమయంలో కాస్త వేడిగా ఉండటంతో సాగర్ చల్లనినీరు ఇవ్వాలని తన స్నేహితుడు గౌరవ్‌ను అడిగాడు. తనను నీళ్లు అడిగాడన్న కోపంతో సాగర్‌తో గౌరవ్ గొడవపడ్డాడు.

సాగర్ భార్య ముందే అతనిపై గౌరవ్ కత్తితో పలుసార్లు దాడి చేశాడు. తీవ్రగాయాలతో సాగర్ ప్రాణాలు విడిచాడు. దాడి చేసిన వెంటనే గౌరవ్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు గౌరవ్ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

2482
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles