దోస్తులకు పిస్తోలు చూపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు

Wed,January 23, 2019 07:59 PM

man shows off pistol to friens, shotts self accidentally

ఇదిగో నా పిస్తోలు చూశారా? అంటూ దోస్తుల దగ్గర దర్జా ప్రదర్శించాలనుకున్నాడు. కానీ వికటించి ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. దక్షిణ ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. అమిత్‌కుమార్ (32) అనే వ్యక్తి ఓ పిస్తోలు కొన్నాడు. దోస్తులు వచ్చినప్పుడు దానిని గొప్పగా చూపాలని అది ఎలా పనిచేస్తుందో చెప్పడం మొదలుపెట్టాడు. తూటాలు ఉండే మ్యాగజైన్ తీసి కణతకు గురిపెట్టుకుని ఉత్తుత్తినే కాల్చుకున్నాడు. కానీ మ్యాగజైన్‌లోంచి బయటకు వచ్చి బ్యారెల్‌లో ఇరుకుక్పోయిన తూటా ఒకటి ఢామ్మని పేలడంతో కుప్పకూలిపోయాడు. దోస్తులు ఠారెత్తిపోయారు. హడావిడిగా అతడిని బాత్రా హాస్పిటల్‌కు చేర్చారు. రక్తం విపరీతంగా కారుతోంది. బతికే అవకాశాలు ఎక్కువగా కనిపించడం లేదు. దాంతో ఏం తలకు చుట్టుకుంటుందో అని బేజారెత్తి కుమార్‌ను స్ట్రెచర్ మీదే వదిలేసి వెళ్లిపోయారు. తర్వత ఓ దోస్తు పిస్తోలు తీసుకువెళ్లి కుమార్ ఇంటిలో అప్పజెప్పాడు. ప్రస్తుతం కుమార్ ఎయిమ్స్ హాస్పిటల్‌లో మృత్యువుతో పోరాడుతున్నాడు. అతని కుటుంబ సభ్యులు మాత్రం ఇదంతా కుట్ర అనీ, కావాలనే దోస్తులు అతడిని చంపేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

840
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles