ఎఫ్‌బీ ఫ్రెండ్‌ను కలిసేందుకు వెళ్లి శవమయ్యాడు

Mon,February 15, 2016 03:06 PM

Man Meets Facebook Friend For Valentine's Day, Gets Killed

న్యూఢిల్లీ : ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్‌లో ప్రేమికుల రోజున దారుణం జరిగింది. ఢిల్లీకి చెందిన ఐశ్వర్, గుర్గావ్ సుశాంత్ లోక్ ప్రాంతానికి చెందిన హవా సింగ్ ఫేస్‌బుక్ స్నేహితులు. వీరిద్దరూ గత ఏడు నెలల నుంచి ఎఫ్‌బీలో చాట్ చేసుకుంటున్నారు. అయితే ప్రేమికుల రోజున కలవాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఐశ్వర్ హవా నివాసానికి చేరుకున్నారు. వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా హవా బావ రమేశ్, అతని డ్రైవర్ అక్కడికి చేరుకున్నారు.

ఐశ్వర్‌ను దారుణంగా చితకబాది బహుళ అంతస్తుల భవనం నుంచి కిందకు తోసేశారు. ఐశ్వర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఐశ్వర్‌ను భవనం నుంచి కిందకు తోసేసిన తర్వాత స్థానికంగా ఉన్న రోడ్డు వద్దకు తీసుకెళ్లి యాక్సిడెంట్‌గా చిత్రీకరించేందుకు రమేశ్ యత్నించాడు. కానీ విఫలయత్నమైంది. ఇక రమేశ్, అతని డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

1727
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles