వైరల్ ఫోటోలు.. అచ్చం మనిషిని పోలిన చేప!Fri,December 15, 2017 05:16 PM

man look alike fish found in vizag sea area

అచ్చం మనిషిని పోలిన చేపను చూశారా మీరు ఎప్పుడైనా? మీరు పైన చూస్తున్న ఫోటో అదే. ఇది నిజమా అబద్ధమా అనే విషయాన్ని పక్కన బెడితే.. ఈ చేప విశాఖ తీరంలో జాలర్లకు దొరికిందట. అచ్చం మనిషిని పోలి ఉండటంతో జాలర్లు భయపడి దాని చేతికి తాళ్లు కట్టేశారు. అంతే కాదు.. ఆ చేప ఇంకా బతికే ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. ఇది నిజంగా వైజాగ్‌లోనే దొరికిందా. అసలు దీంట్లో నిజమెంత అనే విషయాల్లో క్లారిటీ లేదు. కాని.. ఈ వింత చేప విశాఖ తీరంలో దొరికిందంటూ దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది వరకు ఇదే విశాఖలో ఏలియన్స్‌ను పోలిన జీవుల్లా ఉన్న వాటి వీడియో వైరలయిన సంగతి తెలిసిందే. తర్వాత అవి ఏలియన్స్ కాదు.. పాడు కాదు.. అవి గుడ్లగూబ పిల్లలు అని తేల్చేశారు. చూద్దాం.. ఈ ఫోటోలపై కూడా త్వరలో క్లారిటీ వస్తుందేమో?

6745
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS