పెళ్లాన్ని ముక్కలుగా నరికాడు

Wed,April 18, 2018 01:02 PM

Man kills wife and cuts body into pieces in Surat

సూరత్ : సహనం కోల్పోయిన భర్త.. భార్యను ముక్కలుగా నరికాడు. మొదటి భార్యతో నిత్యం గొడవ పడుతున్న రెండో భార్యను గొంతునులిమి హత్య చేశాడు భర్త. ఆ తర్వాత ఆమెను 11 భాగాలుగా నరికి కసి తీర్చుకున్నాడు. ఈ దారుణ ఘటన సూరత్‌లో ఏప్రిల్ 16న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.

మహారాష్ట్రకు చెందిన జులేఖ(32) వేశ్య. గత రెండేళ్ల క్రితం ఆవిడ సూరత్‌కు వచ్చి వేశ్యగా జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో సూరత్‌కు చెందిన కిరాణం దుకాణం యజమాని షానవాజ్ షేక్(32)కు పరిచయం అయింది. జులేఖకు షానవాజ్ శారీరకంగా దగ్గరయ్యాడు. దీంతో జులేఖ, షానవాజ్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే షానవాజ్‌కు అప్పటికే పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహామాడిన తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని షానవాజ్‌తో జులేఖ గొడవ పెట్టుకునేది.

మొదటి భార్యను వదిలేయాలని.. తనతోనే జీవితాంతం ఉండాలని ఆమె డిమాండ్ చేసేది. మొదటి భార్యకు, జులేఖకు నిత్యం గొడవలు జరిగేవి. ఏప్రిల్ 15న ఈ ముగ్గురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన షానవాజ్.. జులేఖ గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని 11 భాగాలుగా నరికివేశాడు. కొన్ని భాగాలను సూరత్‌కు సమీపంలోని నదిలో పడేశాడు. ఎడమ కాలు, చేతితో పాటు ఇతర భాగాలను ఓ లోతైన ప్రదేశములో పడేస్తుండగా సెక్యూరిటీ గార్డు చూసి పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. షానవాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. జరిగిన విషయాన్ని చెప్పి.. జులేఖను తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

7825
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles