కోరిక తీర్చలేదని హతమార్చాడు

Fri,July 19, 2019 12:53 PM

Man Kills Married Woman Who Refused Him Sexual Favours

పాల్‌గర్‌: తన లైంగిక కోరికను తీర్చలేదన్న కారణంతో ఓ వ్యక్తి వివాహితను హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్‌గర్‌లో చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసు అధికారి హేమంత్‌ కట్కర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 15వ తేదీన మహిళ పొలానికి వెళ్తుంది. కాగా రాజేశ్‌ పవార్‌(30) అనే వ్యక్తి మహిళను దారిలో అడ్డగించి తన లైంగిక కోరిక తీర్చాల్సిందిగా బెదిరింపులకు గురిచేశాడు. రాజేశ్‌ కోరికను తిరస్కరించిన సదరు మహిళ విషయాన్ని తన భర్త, గ్రామస్తులతో చెప్పనున్నట్లు పేర్కొంది. దీంతో రాజేశ్‌ తన వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో మహిళపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్‌ చేశారు. విచారణలో తానే హత్య చేసినట్లుగా పేర్కొన్నాడు.

2044
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles