ట్రాక్‌పై దూకిన వ్యక్తి..మెట్రో సర్వీసులు ఆలస్యం

Wed,May 15, 2019 04:04 PM

man jumps on tracks Services delayed on section of Blue Line


న్యూఢిల్లీ: ఓ వ్యక్తి మెట్రో రైల్వే ట్రాక్‌పై దూకాడు. దీంతో ఢిల్లీ మెట్రో బ్లూలైన్ వెంబడి రైలు సర్వీసులు ఆలస్యమయ్యాయి. ద్వారకా వెళ్తున్న మెట్రో రైలు యమునా బ్యాంక్-వైశాలి బ్రాంచ్ సెక్షన్‌లోని కౌసంబి స్టేషన్ ఫ్లాట్‌పాం వద్దకు రాగానే ఓ ప్రయాణికుడు రైలులో నుంచి మెట్రో ట్రాక్ లపై దూకాడు. మెట్రో సిబ్బంది అప్రమత్తమై ఆ ప్రయాణికుడిని రక్షించారని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనతో ఉదయం 9.56 గంటల నుంచి 10.03 గంటల ప్రాంతంలో రైలు సర్వీసులు ఆలస్యమయ్యాయి.ఆ తర్వాత తిరిగి రైలు సేవలు ప్రారంభమయ్యాయి.

2336
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles