బీఫ్ ఫెస్టివల్‌కు ఆహ్వానం పలికి..

Wed,July 17, 2019 05:20 PM

Man held in TN for social media post inviting people to beef


తంజావూరు: బీఫ్ ఫెస్టివల్‌కు ఆహ్వానం పలుకుతూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. కుంబకోణం ప్రాంతంలో త్వరలో జరుగనున్న బీఫ్ ఫెస్టివల్‌కు ఆహ్వానం అందిస్తూ తమిళనాడు కుడియరసు కచ్చి వ్యవస్థాపకుడు ఎస్ ఇజిలన్ అనే వ్యక్తి ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇజిలన్ పై ఐపీసీ సెక్షన్ 298 (మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం), 504 (శాంతికి విఘాతం కల్గించడం), 505 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. నాగపట్టినమ్ జిల్లాలో ఇటీవలే ఓ వ్యక్తి బీఫ్ సూప్ తాగుతూ ఉన్న ఫొటోను ఎఫ్ బీలో పోస్ట్ చేసి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

1999
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles