తల్లిదండ్రులు, భార్యను గొడ్డలితో నరికి చంపాడు..

Fri,May 17, 2019 12:37 PM

Man hacks wife and parents to death with axe in Madhya Pradesh

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని రాయ్‌సేన్‌ జిల్లాలోని సమ్రి గ్రామంలో దారుణం జరిగింది. 32 ఏళ్ల వ్యక్తి తన తల్లిదండ్రులు, భార్యను గొడ్డలితో నరికి చంపాడు. గురువారం రాత్రి జితేంద్ర(32), సునీత(30) దంపతులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ గొడవ జరిగింది. అయితే జితేంద్రను శాంతింపజేసేందుకు అతడి తల్లిదండ్రులు శారద(55), జలం(60) ప్రయత్నించారు. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన జితేంద్ర తల్లిదండ్రులపై విరుచుకుపడ్డాడు. సహనం కోల్పోయిన జితేంద్ర తల్లిదండ్రులను, భార్యను పదునైన గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ దాడిలో ఆరేళ్ల బాలుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని చికిత్స నిమిత్తం భోపాల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. జితేంద్ర పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

3867
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles